|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:17 PM
నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో కారుతో ఢీకొట్టబడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని నిమ్స్ వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఆమె ఆరోగ్య స్థితిని వివరించారు.నిమ్స్ వైద్యుల ప్రకారం, కారు కడుపు పైభాగానికి ఢీకొట్టడంతో లివర్, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పక్కటెముకలు విరిగిపోయాయి. ఎడమ కిడ్నీని తొలగించాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. అయితే, వైద్యానికి సహకరిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఆమెను ఐసీయూలో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. రక్తనాళాలు, శ్వాసకోశ వ్యవస్థలపై కూడా ప్రభావం పడింది. మరిన్ని టెస్టులు, చికిత్సలు కొనసాగుతున్నాయి.శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, గంజాయి ముఠా సభ్యులు కారుతో సౌమ్యను ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను మొదట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు.