గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమం
Tue, Jan 27, 2026, 03:17 PM
|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 10:00 AM
అమీన్పూర్ : నిరుపేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయమని అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. శ్రీ వేద మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరియు జ్యోతి ఫార్మసీ డా వెంకట రెడ్డి గారి ఆధ్వర్యంలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని భారత్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృష్ణ, కొల్లూరు చంద్రకళ గోపాల్, సీనియర్ నాయకులు ఆసిఫ్, తుమ్మల ప్రభాకర్ రెడ్డి, శ్రీ వేద మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సిబ్బంది,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.