|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 11:57 AM
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు అభివృద్ధి కోసమే అంటూ బ్లాక్‌మెయిల్ చేయకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ హితవు పలికారు. దానం నాగేందర్ అంశం స్పీకర్ పరిధిలో ఉందని అన్నారు. కొంతమంది పోలీసు అధికారులు ప్రజా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో పోలీసులు కార్యకర్తల్లా పని చేశారని ఆరోపించారు. ఇప్పుడు కూడా కొందరు పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని, పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు కలిసికట్టుగా పని చేస్తున్నారని మధుయాష్కీ అన్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు సమావేశమయ్యారనేది అబద్ధపు ప్రచారం అన్నారు. ప్రతిరోజు వాళ్లంతా టచ్‌లోనే ఉంటారని అన్నారు.