|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 11:59 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే అబద్ధం చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని వారు చెబుతున్నారని, కానీ పార్లమెంటులో బీజేపీ ఎంపీ ఒకరు అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వచ్చిందని అన్నారు.కేసీఆర్ హయాంలో రూ.3.5 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని తేలిందని, అందులో కేసీఆర్ గద్దెను ఎక్కే నాటికి రూ.72 వేల కోట్ల అప్పు తెలంగాణకు ఉందని తెలిపారు. అంటే కేసీఆర్ పదేళ్ల కాలంలో చేసిన అప్పు రూ.2.5 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. ఆ అప్పు తో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు.