|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 03:10 PM
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి రూ. 9,584 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదించినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అమృత్ 2.0 పథకం కింద తెలంగాణలో 252 ప్రాజెక్టులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపిందని లోక్‌సభలో ఆ శాఖ సహాయ మంత్రి టోకన్ సాహు తెలిపారు. TG ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు తోఖాన్ సాహు బదులిస్తూ, రాష్ట్రంలో రూ. 9,584 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ప్రకటన చేశారు.కేంద్రం ఆమోదించిన ఈ ప్రాజెక్టుల్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడు సీవేజ్/సెప్టేజ్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వీటికి గాను రూ. 3,949.10 కోట్లు కేటాయించగా, కేంద్రం తన వాటాగా రూ. 2,788.03 కోట్లు అందిస్తుంది. దీనితో పాటు నిజాం నగలను ప్రస్తుతం ఉన్న చోటు నుంచి హైదరాబాద్‌లోనే మరో ప్రాంతానికి మార్చే అంశంపై కేంద్రం మంత్రి కీలక ప్రకటన చేశారు.లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకన్ సాహు స్పందిస్తూ.. ఈ వివరాలు వెల్లడించారు. అమృత్ 2.0 పథకం కింద తెలంగాణలో మొత్తం 252 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి మొత్తం విలువ రూ. 9,584 కోట్లు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే మూడు సీవేజ్/సెప్టేజ్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుల విలువ రూ. 3,949.10 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 2,788.03 కోట్లు అని తెలిపారు.