|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 02:57 PM
రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు రాజకీయ పార్టీల బలాబలాల పరీక్ష కాకుండా, అభ్యర్థులు దొరకని దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి పార్టీలకు 60 డివిజన్లలో సరైన నాయకులు లేకపోవడం ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకప్పుడు టికెట్ కోసం పోటీపడిన నాయకులు, నేడు ఎన్నికల ఖర్చు భరించలేక వెనక్కి తగ్గుతున్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ పక్కనపెట్టి, డబ్బు, గెలుపు అవకాశాల ఆధారంగా టికెట్లు ఇస్తున్నారు. దీంతో ఇతర పార్టీల నుంచి నాయకుల దిగుమతులు, వ్యాపారస్తుల ఆహ్వానాలు, కుల సంఘాల పేర్లపై రాజకీయ ప్రయోగాలు మొదలయ్యాయి. ఇది రాజకీయాల పతనానికి నిదర్శనంగా మారింది. ఈ ఎన్నికలు ప్రజల కోసమా లేక పెట్టుబడిదారుల పెట్టుబడి రికవరీ కోసమా అని రామగుండం ఓటరు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.