|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 07:27 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. రేపు కేసీఆర్ విచారణ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ కూతురు, జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. సిట్ విచారణ నాన్-సీరియస్ గా జరుగుతోందని, ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని అన్నారు. కేసును సీరియస్ గా తీసుకుని త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని అయితే, కేసును ముగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజంగానే చాలా బాధాకరమన. కానీ, దానికి తగినటువంటి పర్యవసానాలను నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేది వేచిచూడాలని అన్నారు.