|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 03:37 PM
మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రాజా బొల్లారం తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి చందర్నాయక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తండా మహిళలతో కలిసి ఆయన ధూమ్ ధామ్ నృత్యాలు చేస్తూ ప్రచారాన్ని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనలో అభివృద్ధి లేదని విమర్శించారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, గ్రామాల్లో రోడ్లు, పాఠశాలలు, ఇంటింటికి నీళ్లు, 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రజలు భారీ మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.