|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:11 PM
పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని బంధం కొమ్ములో ఘనంగా నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతరలో బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో–ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అడవి తల్లులైన సమ్మక్క సారలమ్మల దివ్య ఆశీస్సులతో పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సమృద్ధులతో ఉండాలని ప్రార్థించారు.అమ్మవారి కృపతో ప్రజల కష్టాలు తొలగి ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణతో పాటు ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ సమ్మక్కసారలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు నీలం భిక్షపతి గారు,అమీన్‌పూర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాట సునీత రాజు గౌడ్ గారు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.