|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 01:57 PM
హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్పోర్టులో జరుగుతున్న వింగ్స్ ఇండియా ఈవెంట్ కు భారీస్పందన వస్తోంది. ఈవెంట్ లో భాగంగా నిర్వహిస్తున్న డ్రోన్ షో, ఎయిర్ షోకు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఈవెంట్ జనవరి 31 వరకు కొనసాగగా.. జనరల్ విజిటర్లను 30, 31వ తేదీల్లో మాత్రమే అనుమతిస్తారు. అయితే ఇందుకోసం జనరల్ విజిటర్లు రూ.944 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ ఏవియేషన్ కంపెనీల అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను ఈ షోలో తిలకించవచ్చు. ఆసియాలో జరిగే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఈ ఈవెంట్ ప్రతి రెండేళ్ళకొకసారి హైదరాబాద్ లో నిర్వహిస్తారు. మొత్తం నాలుగు రోజుల ఈవెంట్ లో మొదటి రెండు రోజులు VIP లకు, ఏవియేషన్ విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉండగా.. చివరి రెండు రోజులు సాధారణ ప్రజలకు అనుమతి ఉంటుంది.