|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 03:53 PM
తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది కక్ష సాధింపు రాజకీయమని, విచారణ కాదని, ప్రతీకార చర్య అని ఆయన ఆరోపించారు. న్యాయం కాదని, రాజకీయ దురుద్దేశమని ఆయన అభివర్ణించారు.ఉద్యమ నేతను టచ్ చేయడం అంటే రాష్ట్ర ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ అధికారులు కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం పట్ల ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ జాతి పిత, కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడు గౌరవనీయులు కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్ద కాలం పాటు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని అన్నారు. అలాంటి చరిత్రాత్మక నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమేనని కామెంట్ చేశారు.