|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 11:20 AM
శంషాబాద్ విమానాశ్రయంలో డ్రగ్స్ నియంత్రణ విభాగం (DRI) అధికారులు బ్యాంగ్‌కాక్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల వద్ద భారీ మొత్తంలో విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి గంజాయిని స్వీకరించడానికి వచ్చిన మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై DRI అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.కాగా, ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో రూ.12 కోట్లు విలువైన విదేశీ గంజాయిని పట్టుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి వచ్చిన భారతీయ మహిళ దీనిని రవాణా చేస్తూ పట్టుబడింది. ఆమె బ్యాగేజీ నుంచి 6 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి లభించింది. అయితే తన మరొక లగేజ్ తప్పిపోయిందని ఆమె ఫిర్యాదు చేయగా.. అది ఇవాళ హైదరాబాద్‌కి చేరింది. అందులోనూ మరో 6 కేజీల గంజాయి బయటపడింది.