|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 01:58 PM
తెలంగాణలోని మేడారంలో మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మేడారం జనసంద్రంగా మారింది. భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీతో రహదారులన్నీ కిటకిటలాడుతున్నాయి.అంతేకాకుండా వచ్చే రెండు రోజులు భారీ సంఖ్యలో భక్తులు మేడారంకు తరలిరానున్నారు. ఇప్పటికే సారలమ్మ తల్లి, పగిడిద్ద రాజు, గోవింద రాజులు కూడా గద్దెలపైకి చేరుకున్నారు. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజుల ఆగమనంతో మేడారం జాతరలో తొలి ఘట్టం పూర్తి అయ్యింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 251 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసింది. గిరిజన ఆచారం ప్రకారం వనదేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు.