|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 03:43 PM
జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నిజాంపేట్ సర్కిల్ రాజీవ్ గృహకల్ప లో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ రవి కిరణ్ గార్లు ఆ మహనీయుడు మహాత్మా గాంధీ విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అహింసను ఆయుధంగా, సత్యాన్ని మార్గంగా చేసుకొని భారతదేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన మహానీయుడు మహాత్మాగాంధీ గారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నాయకులు సాంబ శివారెడ్డి, బిక్షపతి, ప్రదీప్ తాళ్లూరి, జలగం చంద్రయ్య, కురుమూర్తి, శివ, మహిళా నాయకులు నర్మదా, రిపోర్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు