|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 10:52 AM
మేడారం మహా జాతర సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. దీంతో అక్కడి స్థానిక వ్యాపారులు డిమాండ్ ఉన్నవాటిపై ధరలు భారీగా పెంచేశారు. బయట కేజీ మటన్ ధర రూ.900-1000 ఉండగా.. మేడారంలో రూ.1500కి అమ్ముతున్నారు. ఇక కిలో లైవ్ కోడి బయట రూ.170 ఉండగా.. జాతరలో రూ.350కి విక్రయిస్తున్నారు. అలాగే మద్యం బాటిళ్లపై రూ.100 చొప్పున పెంచినట్లు సమాచారం. తోటల్లో నీడ కోసం వెళ్లే వారికి ఒక్కో చెట్టును రూ.1000-రూ.2 వేలకు అద్దెకు ఇస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే జాతర నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొబ్బరికాయ మొదలు అమ్మలకు సమర్పించే బంగారం (బెల్లం), కోళ్లు, మేకల ధరలతో పాటు, ఇళ్లు, ప్రత్యేక గదుల అద్దెలను భారీగా పెంచి భక్తులను దోచుకుంటున్నారు. ఆఖరికి చెట్టు నీడకు కూడా కిరాయి వసూలు చేస్తున్నారంటే జాతరలో దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించవచ్చు.