|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 12:21 PM
సిగాచి ప్రమాద బాధితుల పరిహారంపై ప్రభుత్వం పట్ల మరోసారి అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన 56 మందికి, ఆచూకీ లభించని 8 మందికి, 28 మంది క్షతగాత్రులకు పరిహారం అందించడంతో పాటు, దర్యాప్తు కోసం ప్రత్యేక SIT ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాబురావు అనే వ్యక్తి. ఈ పిటిషన్ విచారిస్తూ, పరిహారం ఎంత ఇస్తామని చెప్పారు, ఎంత ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు అంటూ మండిపడ్డ హైకోర్టు న్యాయమూర్తి. పరిహారం పంపిణీకి సంబంధించిన అంశాలపై కంపెనీ వివరణ ఇవ్వాలని, దానికి సంబం ధించిన వివరాలను తెలియజేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. కంపెనీ ప్రకటించిన పరిహారంతో పాటు, చట్టప్రకారం అందాల్సిన పరిహారం వివరాలను సమర్పించాలని ఈపీఎఫ్ హైదరాబాద్ రీజినల్ కమిషనర్, ఈఎస్ఐ డైరెక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండళ్లను సుమోటో ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్