|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 03:33 PM
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని గాంధీ థీమ్ పార్కులో మహాత్మాగాంధీ కాంస్య విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్ మెట్టు కుమార్ మదర్ గారితో కలిసి బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, సత్యం, అహింస, సేవా భావన అనే విలువలతో మహాత్మాగాంధీ దేశానికి చూపిన మార్గం నేటి సమాజానికి అత్యంత అవసరమని అన్నారు. యువత గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం గాంధీజీ జీవిత చరిత్ర, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్రపై సంక్షిప్తంగా చర్చించగా, జాతిపిత బోధనలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నర్రబిక్షపాటి గారు,కోమరగూడెం వెంకటేష్ గారు,శ్యామ్ గారు,కిష్టయ్య గారు,రాము గారు,టీంకు గారు ,షకీల్ గారు, పట్టణ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు,మహిళలు మరియు MPR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.