|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 03:03 PM
ఇస్నాపూర్ 4 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నీలం కవిత మధు ముదిరాజ్..
నామినేషన్ పత్రాలతో దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు.నాలుగో వ వార్డ్ ఓటర్లు దగ్గరుండి నీలం మధు చేతుల మీదుగా నామినేషన్ పత్రాలు నీలం కవితకు అందజేత. ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ పరిధిలోని నాలుగో వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిగా శుక్రవారం నీలం మధు సతీమణి నీలం కవిత నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు చిట్కుల్ దుర్గామాత ఆలయంలో నామినేషన్ పత్రాలు అమ్మ వారి దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నాలుగో వార్డ్ మహిళలు పెద్దఎత్తున నీలం నివాసానికి చేరుకుని మేము దగ్గరుండి కవితను గెలిపిస్తామని హామీ ఇచ్చి నీలం చేతుల మీదుగా నామినేషన్ పత్రాలు అందజేశారు.. అనంతరం ఇస్నాపూర్ ఐలా ఆఫీస్ లో నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, మహిళలు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..