|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:41 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని బంధం కొమ్ములో సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొని..అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . జాతర సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బోనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ నందారం నరసింహా గౌడ్, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, తదితరులు.