జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 03:15 PM
సమ్మక్క-సారలమ్మ జాతర పుణ్యమా అని ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయం సాధారణ ప్రయాణికులకు శాపంగా మారింది. శనివారం హుజూరాబాద్ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పోటెత్తగా.. గంటల తరబడి వేచి చూసినా బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేడారం జాతర రద్దీ దృష్ట్యా ఉన్నతాధికారులు దాదాపు అన్ని డిపోల బస్సులను మేడారం స్పెషల్గా మళ్లించడంతో రెగ్యులర్ రూట్లలో బస్సుల రాక పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల హన్మకొండ, కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. స్థానిక డిపోలో కూడా అదనపు బస్సులు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది.