|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 01:59 PM
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. తన ఆరోగ్య పరిస్థితి లేదా భద్రతా కారణాల దృష్ట్యా ఫాంహౌస్‌లోనే విచారణ జరపాలని ఆయన కోరే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. సిట్ నోటీసుల్లోని సాంకేతిక అంశాలను లేదా సెక్షన్లను సవాలు చేసే అవకాశం ఉందని, విచారణపై స్టే ఇవ్వాలని లేదా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.మాజీ సీఎం కేసీఆర్‌కి నోటీసులు ఇవ్వడం.. అది కూడా ఇంటి గోడకు అతికించడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.