జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని కారు
Thu, Jan 29, 2026, 08:18 PM
|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 10:52 AM
ములుగు జిల్లా మేడారం మహాజాతరకు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు కుటుంబ సమేతంగా వెళ్లారు. సమ్మక్క- సారలమ్మ వన దేవతలను దర్శించుకుని మొక్కులు సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవతలను ప్రార్థించారు. మేడారం జాతర విశిష్టతను గుర్తుచేస్తూ, ఈ పవిత్ర ఉత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. మేడారం జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తూ.. ప్రజల మధ్య ఐక్యతను చాటిచెబుతుందన్నారు.