|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 10:40 AM
TG: హైదరాబా్ కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు రూ.6 లక్షలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలో రషీద్ అనే వ్యక్తికి గాయాలు కాగా.. అతడిని ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన సుల్తాన్‌బజార్ పోలీసులు ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.రిన్షాద్ నాంపల్లిలో బట్టల వ్యాపారి అని, తన రూ.6 లక్షల నగుదును డిపాజిట్ చేసేందుకు వచ్చిన క్రమంలోనే చోరీ జరిగిందని ఏసీపీ మీడియాకు వెల్లడించారు. క్లూస్ టీం ఘటనా స్థలం నుంచి రెండు షెల్స్‌ని స్వాధీనం చేసుకున్నాయన్నారు. కేవలం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే కాలిలో కాల్చి నగదు ఎత్తుకెళ్లి ఉంటారని.. నిందితులు పాత నేరస్తులై ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారామె. నిందితుల పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.