|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 07:51 PM
మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చెంగిచర్లకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విజయ (35), తన ఇద్దరు పిల్లలు విశాల్ (17), చేతన (18) తో కలిసి చర్లపల్లి-ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. విజయ పార్క్ చేసిన కారులో లభించిన సూసైడ్ నోట్ లో 'నా జీవితం నచ్చట్లేదు.. బతకాలని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. పిల్లల్ని వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదు. నాతో పాటే పిల్లలను తీసుకువెళ్తున్నా.. క్షమించు అమ్మా' అని రాసి ఉంది. కుటుంబంలో ఆర్థిక సమస్యలు లేవని, భర్త సురేందర్ రెడ్డి దుబాయ్ లో ఉంటున్నారని విజయ తల్లి తెలిపారు. కుటుంబ సభ్యుల అన్యోన్యత ఉన్నా విజయ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది మిస్టరీగా మారింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.