|
|
by Suryaa Desk | Sat, Jan 31, 2026, 07:50 PM
హార్వర్డ్ యూనివర్సిటీలో చివరి రోజు కార్యక్రమాల్లో విభిన్న ప్రతినిధి బృందాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. హార్వర్డ్ వివిధ స్కూల్స్ విద్యార్థులు, అలుమ్ని… అలాగే MIT, కొలంబియా క్యాంపస్‌ల విద్యార్థులతో సీఎం సమావేశం. నాయకత్వం, విజయ రహస్యాలు, ఆర్థిక అభివృద్ధి నమూనాలపై సీఎంతో విద్యార్థుల చర్చ. సస్టైనబిలిటీ, పర్యావరణ పరిరక్షణ, రైతులు–మహిళలు–యువత సంక్షేమంపై ప్రశ్నలు. “#TelanganaRising 2047” విజన్, అవకాశాలపై వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. అన్ని వర్గాల సాధికారతే తెలంగాణ అభివృద్ధి లక్ష్యం అని స్పష్టం చేసిన సీఎం. “నాయకత్వం నేర్పమంటే… హార్వర్డ్ ప్రొఫెసర్లే ఉత్తములు” అని సీఎం రేవంత్ సరదా వ్యాఖ్య. భారతదేశంతో అనుసంధానం పెంచుకొని పనిచేయాలని విద్యార్థులకు సీఎం పిలుపు. “తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి” అని విద్యార్థులకు సీఎం సందేశం. తెలంగాణ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని విద్యార్థుల హామీ