|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 03:26 PM
TG: హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభం అయింది. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందం ఆయనను విచారిస్తోంది. అయితే ఈ విచారణకు కేసీఆర్ తరపు న్యాయవాదులకు సిట్ అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసంలో ఉన్న హరీశ్ రావుతో పాటు పలువురుని ఇంటి నుండి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు.