|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:32 PM
ఏప్రిల్ 1వ తేదీ నుంచి నూతన ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆమె లోక్‌సభలో ప్రసంగిస్తూ, సామాన్యులు కూడా ఫైల్ చేసేలా ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేసినట్లు చెప్పారు. సరళతరం చేసిన ఫారాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు.సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును పెంచుతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 31తో గడువు ముగిసిందని, దీనిని మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. విదేశీ యాత్రలపై పన్ను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే విదేశీ విద్య, వైద్యంపై టీడీఎస్ 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించనున్నట్లు తెలిపారు.మానవ వనరుల సరఫరా సంస్థలపై కూడా టీడీఎస్ తగ్గించనున్నట్లు తెలిపారు. ఈ ఏజెన్సీలపై 1 లేదా 2 శాతం టీడీఎస్ వర్తిస్తుందని అన్నారు. రహదారి ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్నును తొలగిస్తున్నామని అన్నారు.