|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 10:47 AM
హైదరాబాద్‌లోని పాక్ సంతతి వ్యక్తికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. లాంగ్ టర్మ్ వీసా (ఎల్‌టీవీ)కు అప్లై చేయాలని పోలీసులు తనను వేధిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సయ్యద్ అలీ హుస్సేనీ రజ్వీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అధికారుల చర్యలు చట్టపరమైనవేనని తేల్చిచెప్పింది. ఆధార్, ఓటర్ కార్డు ఉంటే భారత పౌరులైపోరని స్పష్టం చేసింది. పిటిషనర్ భారత పౌరుడని నిరూపించే ఆధారాలు లేవని, పౌరసత్వ చట్టం, విదేశీయుల చట్టం ప్రకారం.. పాస్‌పోర్టు, వీసా స్థితి, సంబంధిత అధికారుల ఉత్తర్వులే కీలకమని హైకోర్టు స్పష్టం చేసింది.