|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 11:12 AM
చింతల శ్రీధర్ యాదవ్ గారి 5వ వర్ధంతి సందర్భంగా, MRY ఫౌండేషన్ ఆధ్వర్యంలో, కొండాపూర్ ఆసుపత్రి పరిసర ప్రాంతంలో రోగులు మరియు వారి సహాయకులకు భోజన పంపిణీ, పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని *చింతల శ్రీకాంత్ యాదవ్ మరియు అతని కుటుంబం* ఏర్పాటు చేయగా... ఈ సేవా కార్యక్రమంలో MRY ఫౌండేషన్ ఫౌండర్, ఛైర్మన్ *మారబోయిన రవి యాదవ్ గారు* మరియు బీఆర్ఎస్ కుటుంబ సంభ్యులు పాల్గొని, మానవతా విలువలను చాటుతూ స్వయంగా సేవా కార్యక్రమాలను పర్యవేక్షించారు. కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలవడమే *చింతల శ్రీధర్ యాదవ్ గారి* ఆశయమని పేర్కొంటూ, ఆ స్ఫూర్తితో MRY ఫౌండేషన్ నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ MRY ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అన్న భావనతో, సమాజ సేవలో MRY ఫౌండేషన్ ముందుండి నడుస్తుందని మారబోయిన రవి యాదవ్ గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సురేష్ యాదవ్, వెంకట్ యాదవ్, ప్రేమ్, ప్రవీణ్ యాదవ్, ప్రభాకర్ గౌడ్, వెంకటాచారి,సుమన్, గంగాధర్ గౌడ్, మున్నా, సాయి నందన్ ముదిరాజ్, పవన్, చందు గౌడ్,సురేష్, కృష్ణ, శివాజీ, మహేష్, నర్సింహా, వెంకట్, సతి గౌడ్, రాజు చారి, రఫీక్, కే.రాజేశ్వరి, అనిల్ యాదవ్, ప్రసాద్, శ్రీశైలం యాదవ్, తుమ్మటి వినోద్ యాదవ్, పంతం శివ యాదవ్,చింతల నిఖిల్ యాదవ్, పంతం సునీల్ యాదవ్, తుమ్మటి నవీన్ యాదవ్, సాయి యాదవ్, చింతల కిషోర్ యాదవ్, పండు, సాంసంగ్ తదితరులు పాల్గొన్నారు.