|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 04:14 PM
చేవెళ్ల మున్సిపాలిటీ 11వ వార్డుకు చెందిన స్వామి గౌడ్, మహమ్మద్ ఖలీమ్, వహీద్, ఆనంద్ సన్నీ వంటి పలువురు ముఖ్య నాయకులు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే యాదయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే యాదయ్య వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పైండ్ల మధుసూదన్ రెడ్డి విజయానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.