|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 06:31 PM
జగిత్యాలలో కేసీఆర్ సిట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జిల్లా కేంద్రంలో భారీ నిరసన చేపట్టి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీలు ఎల్. రమణ, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే విచారణ చేపట్టారని ఆరోపిస్తూ, ఇలాంటి చర్యలు కొనసాగితే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.ఆదివారం జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామ గ్రా మాన పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేప ట్టాలని బీఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు పిలు పు నిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, దావ సురేష్, హరిచరణ్ రావు, గంగరెడ్డి, అవారి శి వకేసరి బాబు, దేవేందర్ నాయక్, అయిల్నేని సాగ ర్‌రావు, వొల్లెం మల్లేశం, ఆనంద్‌రావు పాలొన్నారు.