|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 03:18 PM
నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన పలు బడ్జెట్‌లలో వేతనజీవులకు భారీ ఊరట కల్పిస్తూ ప్రకటనలు చేసింది. ఈసారి కూడా ఆదాయపు పన్ను తగ్గింపుపై వేతనజీవులు ఆశగా ఎదురు చూసినప్పటికీ నిరాశ ఎదురైంది. కొత్త, పాత పన్ను విధానాల్లోని స్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.విధానపరమైన అంశాల్లో మాత్రమే పన్ను చెల్లింపుదారులకు కాస్త ఊరట దక్కింది. ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫైలింగ్‌కు జులై 31 వరకు గడువు కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నాన్-ఆడిట్ బిజినెస్‌లు, ట్రస్టులు ఫైలింగ్‌కు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చారు. ఆదాయపు పన్ను నిబంధనలు సరళతరం చేసినట్లు వెల్లడించారు.