|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 03:18 PM
చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 50 మేర పెంచాయి. అయితే, గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోవడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం.తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,740.50కి చేరింది. కోల్‌కతాలో రూ. 1,844.50, ముంబైలో రూ. 1,692, చెన్నైలో రూ. 1,899.50కి చేరుకున్నాయి. గత జనవరిలో కూడా ఈ సిలిండర్లపై ఏకంగా రూ. 111 పెంచిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు నెలల పాటు ధరలు పెరగడంతో హోటళ్లు, క్యాంటీన్లు, రోడ్డు పక్కన ఉండే ఆహార దుకాణాల్లో తినుబండారాల ధరలు పెరిగే అవకాశం ఉంది.