బోర్డర్ 2: రూ.300 కోట్లు దాటిన వసూళ్లు
by Suryaa Desk |
Mon, Feb 02, 2026, 06:28 PM
బాలీవుడ్‌లో క్లాసిక్ వార్ డ్రామాగా నిలిచిన ‘బోర్డర్’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘బోర్డర్ 2’ బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్రను కొనసాగిస్తోంది. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో, అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 10వ రోజుకే కీలక మైలురాయిని అందుకుంది. రెండో ఆదివారం ఒక్కరోజే సుమారు రూ.24.22 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించడంతో ఈ చిత్రం భారత్‌లో ప్రతిష్టాత్మకమైన రూ.300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్ర విజయోత్సాహంలోనే మేకర్స్ ‘బోర్డర్ 3’ ను కూడా అధికారికంగా ప్రకటించారు.
1997లో వచ్చిన క్లాసిక్ మూవీ బోర్డర్ కు సీక్వెల్ గా ఇప్పుడు బోర్డర్ 2 వచ్చింది. ఇందులో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి తదితరులు నటించారు. పాజిటివ్ మౌత్ టాక్ తో బోర్డర్ 2 కు మంచి ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో వచ్చే సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మన భారత త్రివిధ దళాలకు బోర్డర్ 2 మూవీ మంచి ట్రిబ్యూట్ అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా సన్నీ డియోల్ కు అదిరే కమ్ బ్యాక్ అనే కామెంట్లు వస్తున్నాయి.
Latest News