|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:36 PM
నటుడు శివాజీ, సీనియర్ నటి లయ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’లో ఈ నెల 12 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రబృందం, తాజాగా సినిమాలోని ‘పాయా పాయా’ అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. ఈ పాటలో ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తన డ్యాన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఫుడ్ ఫెస్టివల్ నేపథ్యంలో కలర్‌ఫుల్‌గా చిత్రీకరించిన ఈ పాటలో బండ్ల గణేశ్ ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఆయనతో పాటు కమెడియన్ అలీ, బబ్లూ, భోలే శావలి కూడా సందడి చేశారు. ఈ పాటకు విశేషం ఏమిటంటే, పవన్ కల్యాణ్‌పై బండ్ల గణేశ్‌కు ఉన్న అభిమానాన్ని ఇందులో హైలైట్ చేశారు. గతంలో వైరల్ అయిన తన "ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా" అనే డైలాగ్‌ను ఈ పాటలో రీమిక్స్ చేశారు. పవన్ మేనరిజాన్ని అనుకరిస్తూ బండ్ల వేసిన స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Latest News