|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 03:53 PM
వసంత పంచమి సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 45 మంది చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. మాఘ శుద్ధ పంచమి రోజున సరస్వతీ దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారని, ఈ రోజున అక్షరాభ్యాసం చేసుకున్న పిల్లలపై దేవి ఆశీస్సులు ఉంటాయని సప్త శక్తి సంగం ప్రముఖ్ నాగలక్ష్మీ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.