|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:26 PM
కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ వివాదాలకు దారితీస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో సింగిల్ విండో డైరెక్టర్ తోటరాజుకు నాలుగో వార్డ్ కౌన్సిలర్ టికెట్ దక్కకపోవడంతో ఆయన సోమవారం ఉదయం నుండి అదృశ్యమయ్యారు. ఆదివారం రాత్రి టికెట్లు ఖరారు కాగా, వేరే అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో రాజు కనిపించకుండా పోయారు. ఆయన భార్య దేవలక్ష్మీ ఆందోళన చెందుతున్నారు. వేములవాడ పట్టణ ఎస్సై రామ్మోహన్ గౌడ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి, సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా గాలిస్తున్నారు.