|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 10:52 AM
పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఆల్ టైమ్ గరిష్ఠాల వద్ద ఒక్కసారిగా మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో.. ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు దిగొస్తున్న సంగతి తెలిసిందే. కిందటి వారం గురువారం, శుక్రవారం రాత్రి వేళల్లో భారీగా క్రాష్ అయిన సంగతి తెలిసిందే. బంగారం ధర 15 శాతానికిపైగా.. వెండి ధర 30 శాతానికిపైగా కరెక్షన్‌కు గురయ్యాయి. దీంతో దీనికి అనుగుణంగానే.. వెంటనే దేశీయ మార్కెట్లలో బంగారం ధర 2 రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 16 వేలకుపైగా తగ్గింది. ఇదే సమయంలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ. 1.05 లక్షలు పతనమైంది. శనివారం, ఆదివారం.. ఇంటర్నేషనల్ మార్కెట్లకు సెలవు. అయితే.. ఆదివారం రోజు బడ్జెట్ సందర్భంగా కమొడిటీ మార్కెట్లు పనిచేయగా.. బంగారం, వెండి ధరలు అక్కడ భారీగా పతనం అయ్యాయి.హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.9,050 తగ్గి రూ.1,51,530కు చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల బంగారం ధర రూ.8,300 తగ్గి రూ.1,38,900 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండిపై రూ.20,000 తగ్గి రూ.3,00,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.