|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 11:25 AM
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఆదివారం కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు చోటుచేసుకున్నాయి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్ కు చెందిన మోతుపాటి స్వప్న ఆనంద్, 17వ డివిజన్ కు చెందిన పోలవేణి రమేష్ లు ఆర్యవైశ్య భవనంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.