|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 03:50 PM
మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆత్మహత్యలకు నిలయంగా మారుతోంది. తాజాగా, గుర్తు తెలియని వ్యక్తి రాత్రిపూట దుర్గం చెరువు సమీపంలో స్కూటీ పార్క్ చేసి బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు హైడ్రా బృందాల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వద్ద సెల్ ఫోన్, స్కూటీ తాళాలు లభ్యమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.