|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 03:45 PM
సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాన్ని చూసి సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే భయంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కు భారీగా సీట్లు వస్తాయనే ఆందోళనతోనే సిట్ పేరుతో పార్టీ నేతలు హరీష్ రావు, కేటీఆర్‌లకు నోటీసులు ఇచ్చి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బలాన్ని అడ్డుకోలేకనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందన్నారు.