|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 03:55 PM
వసంత పంచమి సందర్భంగా గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని సంతోష్ నగర్ లో గల అంబా భవాని ఆలయంలో విజయ మేరీ స్కూల్ విద్యార్థులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై, విద్యార్థులందరూ చదువుల తల్లి సరస్వతిని పూజించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.