|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 07:47 PM
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మంత్రి కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది. సిట్ అధికారులు కేటీఆర్‌ను 7 గంటలకు పైగా ప్రశ్నించారు. ఈ విచారణలో భాగంగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన పాత్రపై పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు సేకరించే పనిలో సిట్ అధికారులు నిమగ్నమై ఉన్నారు. తదుపరి విచారణకు అవసరమైతే కేటీఆర్‌ను మళ్లీ పిలిపించే అవకాశం ఉంది.