|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 07:46 PM
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి శుక్రవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ, చేనేత సంఘాల బలోపేతానికి ప్రత్యేక కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికుల రుణమాఫీ పథకం కింద ఆదర్శ సొసైటీ, కాటేదాన్‌కు చెందిన లబ్ధిదారులకు రుణమాఫీ చెక్కులను ఆమె అందజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఇందిరా, ఏడీఓ ఎన్. కిషన్ నాయక్, సంఘ ప్రతినిధులు పున్న కృష్ణయ్య, సుభద్ర, నరేష్ తదితరులు పాల్గొన్నారు.