|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 12:28 PM
ములుగు మేడారం, కన్నేపల్లి ఆలయాల్లో రేపు (బుధవారం) సమ్మక్క-సారలమ్మకు తిరుగువారం పండుగ జరగనుంది. మహాజాతర ముగిసిన వారం రోజుల తర్వాత ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజారులు ఆలయాలను శుద్ధి చేసి, ధూపదీపాలతో నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. గిరిజన, గిరిజనేతర భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ పండుగతో మేడారం మహాజాతర పూజా కార్యక్రమాలు సంపూర్ణంగా ముగియనున్నాయి.