|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 02:48 PM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ రాష్ట్రానికి తొలిసారి రానున్న నేపథ్యంలో, ఆయన పర్యటనను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. మంగళవారం కాటేదాన్‌లోని అయ్యప్ప ఆలయం సమీపంలో సూరెడ్డి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కడ్డం సుధాకర్, జోగు రవికుమార్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గగన్‌పహాడ్ నుండి శంషాబాద్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. జాతీయ అధ్యక్షుడి రాక తెలంగాణ బీజేపీకి కొత్త ఉత్తేజాన్నిస్తుందని సూరెడ్డి వినయ్ రెడ్డి పేర్కొన్నారు.