|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 03:11 PM
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జోగులాంబ గద్వాల కాంగ్రెస్‌లో సీట్ల పంపకాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. 37 వార్డులకు గాను 7 సీట్లు సరిత తిరుపతయ్య వర్గానికి, 30 సీట్లు ఎమ్మెల్యే బండ్ల వర్గానికి కేటాయించినట్లు వార్తలు వస్తున్నా, ఎమ్మెల్యే వర్గానికి చెందిన అభ్యర్థులందరికీ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్‌లు జారీ చేసింది. అయితే, సరిత వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కూడా 7 వార్డులకు బీ ఫామ్‌లతో దర్శనమిచ్చారు. ఇప్పటికే ఆ 7 వార్డులకు ఎమ్మెల్యే వర్గానికి చెందిన అభ్యర్థులు బీ ఫామ్‌లు సమర్పించడంతో, ఒకే వార్డుకు రెండు వర్గాలకు బీ ఫామ్‌లు ఇవ్వడంపై గందరగోళం నెలకొంది. చివరికి ఎవరి బీ ఫామ్‌లు చెల్లుతాయో తెలియాల్సి ఉంది.