|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 03:08 PM
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నాగసాల సమీపంలోని మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆదివారం పాఠశాల నుంచి అదృశ్యమయ్యారు. తాము ఐదేళ్ల తర్వాత వస్తామని చీటీ రాసి వెళ్లిన విద్యార్థుల ఆచూకీని పోలీసులు ముంబైలో గుర్తించారు. ప్రిన్సిపల్ ఫిర్యాదుతో సోమవారం విచారణ చేపట్టిన పోలీసులు, మంగళవారం విద్యార్థులను తీసుకురావడానికి వారి తల్లిదండ్రులతో కలిసి ముంబైకి వెళ్లారు.