|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 12:07 PM
TG: కూకట్‌పల్లిలోని మోతి నగర్లో నివాసముంటున్న ఆదిలాబాద్ (D)బైంసాకు చెందిన విజయలక్ష్మి (26) ఆదివారం హుస్సేన్ సాగర్‌లో దూకి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న విజయలక్ష్మి.. తన తల్లి అనారోగ్యంతో ఉండడంతో ఆమె బాగోగులు చూసుకుంటోంది. అయితే విజయలక్ష్మికి ఇంట్లో పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే తాను పెండ్లి చేసుకుని వెళ్లిపోతే అమ్మ ఏమైపోతుందోననే ఆలోచనతో మనస్తాపం చెందింది. జనవరి 31న రాపిడో టూ వీలర్ బుక్ చేసుకుని మధ్యాహ్నం 12:30 గంటలకు ట్యాంక్ బండ్ చేరుకుని అన్నమయ్య విగ్రహం వద్ద హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కజిన్బ్రదర్స్ కూకట్‌పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, డెడ్‌బాడీని ట్రేస్ చేశారు. ల్యాప్‌టాప్‌లో ఆత్మహత్య ఎలా చేసుకోవాలనే సెర్చ్ కనిపించినట్లు లేక్ పోలీసులు తెలిపారు. తల్లి అనారోగ్యం, పెండ్లి సంబంధాలు మానసిక బాధతో విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.