|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 12:27 PM
సోషల్ మీడియాలో ఫాలోవర్లు, లైకుల కోసం యువకుడు చేసిన ప్రమాదకరమైన చర్యపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేగంగా వస్తున్న రైలు పట్టాల మధ్య యువకుడు పడుకున్న వీడియోను ఆయన ట్వీట్ చేస్తూ, 'వైరల్ పిచ్చితో ఇలాంటి పనులు చేయడం సాహసం కాదు.ఈ మధ్య కాలంలో కొంత మంది యువతకు పిచ్చికి పరాకాష్టకు చేరుకుందన్నారు. ఉధాహరణకు ఈ సంఘటననే చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క సెకను ఏమాత్రం తేడా జరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని కూడా యువత ఆలోచించడం లేదన్నారు. ఇలాంటి మానసిక రోగులకు కౌన్సిలింగ్ అత్యవసరమని సీపీ వెల్లడించారు. ఒకవేళ ప్రమాదం జరిగి ప్రాణం పోతే, ఆ కుటుంబం అనుభవించే బాధ వర్ణనాతీతమని సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా యువత కుటుంబసభ్యులను గుర్తు చేసుకుని ఈ పనులు చేయవద్దు అని సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై పడుకున్న వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..